టీడీపీ నేత అయ్యన్నపాత్రులు పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పోలీసుల పని పడతానని హెచ్చరించారు. ' దౌర్భాగ్యులంతా జైలుకెళ్లాక పోలీసులు మాకిందే ఉండాలి. నాకు హోంమినిస్ట్రీ ఇస్తే లా అండ్ ఆర్డర్ కూడా ఇవ్వండి. అప్పుడు షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇస్తా. దౌర్జన్యాలకు పాల్పడిన పోలీసుల లిస్టు రెడీ చేస్తా. నా కొడుకుల సంగతి అప్పుడు తేలుస్తా' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.