నిస్వార్థ సేవకులైన గ్రామ, వార్డు వలంటీర్లపై ఈనాడు రామోజీరావు విషపు రాతలు రాస్తున్నారని సమాచార, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. వలంటీర్లు అంత నిస్వార్థంగా పని చేస్తుంటే, రామోజీరావుకు ఎందుకంత అక్కసు? అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీల దోపిడీ రామోజీ కళ్లకు కనిపించలేదా అని నిలదీశారు. పింఛన్లు, ఇళ్ల మంజూరు హక్కును జన్మభూమి కమిటీలకు ఇచ్చారని, ఆ మేరకు జీవోలు కూడా జారీ చేశారని గుర్తుచేశారు.