చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని వైయస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయాలు వేరు సినిమా వేరని పవన్ కళ్యాణ్ తెలుసుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. వ్యక్తిగత దూషణలకు దిగినంత మాత్రాన తమకు ఉన్న గౌరవం ఏమీ తగ్గదన్నారు. ఆ విషయం గుర్తిస్తే మంచిదని సూచించారు. ఆరోగ్యకరమైన విమర్శలను, ఆరోపణలను స్వాగతిస్తామని కానీ పూర్తిగా తమ నాయకుడు వైయస్ జగన్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ నైజం ఎలా ఉందంటే రంగం సినిమాలోని విలన్ క్యారెక్టర్ ను తలపింప చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.