నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు మండలం జడదేవి సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణించే గుంటి పవన్ ప్రసాద్ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరు నుంచి ఉదయగిరికి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని జేసీబీ సహాయంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.