ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు గవర్నర్ విశ్వ భూషణ్ తో భేటీ అయ్యారు. ప్రభుత్వం ఆర్థిక నిబంధనల్ని ఉల్లంఘిస్తోందని, తమ బకాయిలు త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమకు రూ.12,000 కోట్లు బకాయి ఉందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ప్రభుత్వం జీపీఎఫ్ ఖాతాల నుండి రూ.500 కోట్లు తీసుకోవడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.