తూర్పు గోదావరి జిల్లా, గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మరణించగా, క్లీనర్‌కు తీవ్రగాయాలయ్యాయి. కాకినాడ నుంచి కత్తిపూడి వైపు వెళుతున్న ఆయిల్‌ట్యాంకర్ టైరుకు పంక్చర్ కావడంతో పిఠాపురం మండలం చిత్రాడ గ్రామానికి చెందిన డ్రైవర్ తుంగల ఆంజనేయులు కిందకు దిగి మరమ్మతులు చేస్తున్నాడు. అతనికి క్లీనర్ ఎం. రమణ సహకారం అందిస్తున్నాడు. ఈలోగా వెనుక నుంచి కోళ్ల వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో ఆంజనేయులు, రమణలకు తీవ్రగాయాలు కాగా హైవే మొబైల్‌పై కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్ ఆంజనేయులు అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. గొల్లప్రోలు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.