ఏపీలోని ప్రకాశం జిల్లా కనిగిరిలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు బైక్‌పై అతివేగంతో వెళ్తూ రోడ్డు పక్కనే ఉన్న చేతి పంపును ఢీకొట్టాడు. దీంతో బోరింగ్ హ్యాండిల్ యువకుడి పొట్టలోకి దూసుకెళ్లి అవతల వైపుకు వచ్చింది. వెల్డింగ్ కట్టర్‌తో బోరింగ్ హ్యాండిల్‌ని కత్తిరించి ఆస్పత్రికి తరలించగా, శస్త్ర చికిత్స చేసి పొట్టలో ఉన్న హ్యాండిల్ ముక్కను బయటకు తీశారు వైద్యులు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.