కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్.అశోక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెలా రూ.2 వేలు చొప్పున అందించనున్నట్లు చెప్పారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఇది వర్తిస్తుందని వెల్లడించారు. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో దీనిపై ప్రకటన చేస్తామన్నారు. ఈ ఏడాది జులై నుంచే పథకం అమలు చేస్తామని తెలిపారు. సీఎం బొమ్మై దీనిపై మరిన్ని ఈ పథకంపై వివరిస్తారన్నారు.