గూగుల్‌పై సీసీఐ జరుపుతున్న విచారణలో ఎలాంటి లోపాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.ఈ వ్యవహారంలో స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు, నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ దగ్గరే తేల్చుకోవాలంది. ఆండ్రాయిడ్ కు సంబంధించి తన ఆధిక్యతను గూగుల్ దుర్వినియోగం చేస్తోందని, కాంపిటీషన్ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ లో గుత్తాధిపత్య ధోరణులకు పాల్పడుతోందని నాడు గూగుల్ పై సీసీఐ రూ. 1,337 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.