ప్రొద్దుటూరు మండల పరిధిలోని చిన్నశెట్టిపల్లె వద్ద నిర్మిస్తున్న జగనన్న కాలనీలను గురువారం సీసీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు జి. ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి చంద్ర, పట్టణ కార్యదర్శి పి. సుబ్బరాయుడు, తదితర నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో లబ్దిదారుల ఇళ్ళ నిర్మాణానికి సంబందించిన నాణ్యతా ప్రమాణాలు, లే ఔట్ సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో పట్టణ సహయ కార్యదర్శి షరీఫ్, పట్టణ సమితి సభ్యులు శివారెడ్డి, హరి, ప్రమీల, సురేష్, ప్రతాప్, సుజాత, రైతు సంఘం నేతలు పాల్గొన్నారు.