వలేటివారిపాలెం మండలం పోకూరు గ్రామంలో శుక్రవారం ఉదయం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని విచారించారు. అర్హులైన ఎవరికైనా పథకం ప్రయోజనాలు అందకపోతే అందుకు గల కారణాలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తున్నారు. ఎమ్మెల్యే వెంట ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.