ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ పథకాలకు ఈ క్రాఫ్ తప్పనిసరి - ఏ. ఓ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 20, 2023, 01:41 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీ, నష్టపరిహారం, రైతు భరోసా వంటి పథకాలు రైతులకు అందాలంటే తప్పనిసరిగా ఈ క్రాఫ్ చేయించుకోవాలని ఎర్రగొండపాలెం మండల వ్యవసాయాధికారి పెద్ద వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రబీ సీజన్ కి సంబంధించి 1, 267 ఎకరాలకు గాను 657ఎకరాలు ఈ క్రాఫ్ బుకింగ్ జరిగిందన్నారు. ఈకేవైసి 59 ఎకరాలకు జరిగిందని తెలిపారు. ఈ క్రాఫ్, ఈకేవైసి కోసం ఆర్బికే కార్యాలయంలో సంప్రదించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com