బీహార్ లోని పాట్నాలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవతో అద్దె ఇల్లు తగలబడింది. పీర్ముహానికి చెందిన అమిత్ తన భార్య తనను అడగకుండా స్వెట్టర్ ఉతికేందుకు వేసిందని బుధవారం ఇంటికి నిప్పంటించాడు. భార్య, స్థానికులు మంటలు అదుపు చేసేందుకు యత్నించినా ఇల్లు దగ్ధమైంది. అయితే, అమిత్ మానసిక సమస్యతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.