రోడ్లపై బహిరంగ సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.1 పై సుప్రీంకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ నెల 23న దీనిపై హైకోర్టులో విచారణ ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. జీవో నెం.1 పై హైకోర్టు విధించిన స్టే ను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.