ప్రతి శుక్రవారం జగనన్న కాలనీలలో అన్ని శాఖల అధికారులతో హౌసింగ్ డే కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా పుల్లలచెరువు మండలం ఎండ్రపల్లి జగనన్న కాలనీలో లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. త్వరితగతిన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. నూతనంగా నిర్మాణం చేపట్టిన వాటికి భూమి పూజ చేశారు. హౌసింగ్ ఏఈ జాన్ సుందర్, వెలుగు ఎపియం వెంకటయ్య, పిఆర్ ఏఈ నాగప్ప, ఏపీవో శైలజ, విఆర్వో డేవిడ్, వర్క్ ఇన్స్పెక్టర్ ప్రకాష్, ఇంజనీరింగ్ ఆసిస్టెంట్ లక్ష్మ నాయక్, లబ్దిదారులు ఉన్నారు.