బాపట్ల జిల్లా చీరాల కు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ త్వరలో రానున్నారు. సమాజ్వాది పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో నెలకొల్పిన భారతదేశ రక్షణ శాఖ మాజీ మంత్రి ములయం సింగ్ యాదవ్ విగ్రహావిష్కరణకు రావలసిందిగా ఆ పార్టీ రాష్ట్ర శాఖ కార్యదర్శి సయ్యద్ బాబు గురువారం రాత్రి విజయవాడలో అఖిలేష్ యాదవ్ ను కలిసి ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లోని చీరాల పట్టణంలో తన తండ్రి విగ్రహాన్ని నెలకొల్పడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సయ్యద్ బాబును ఆయన అభినందించారు.