పాన్ కార్డ్ ఉన్నవారంతా పాన్ నెంబర్ కు ఆధార్ నెంబర్ లింక్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే చాలా సార్లు సూచించింది. పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ చేయడానికి 2023 మార్చి 31వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. అయితే ఈ తేదీలోపు పాన్ నెంబర్ కు ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి మీ పాన్ కార్డ్ పనిచేయదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆధార్ లింక్ చేయని పాన్ నెంబర్లు ఉపయోగించకూడదని ఐటీ శాఖ పేర్కొంది.