తజికిస్థాన్ రాజధాని దుషాన్ బేలో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.5 గా నమోదైంది. దుషాన్ బేకు 171 కి.మీ దూరంలో.. 10 కి.మీ లోతులో ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్ సీఎస్) ట్వీట్ చేసింది. ఈ ప్రకంపనలతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. కాగా, తజికిస్థాన్ లో భూకంపాలు ఎప్పటికప్పుడు సంభవిస్తుంటాయి.