ఏపీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి చివరి వారంలో ఉండే అవకాశాలున్నాయి. బడ్జెట్ సమావేశాలను 20 నుంచి 25 రోజులపాటు నిర్వహించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మార్చిలో రెండు కీలక అంతర్జాతీయ సదస్సులు జరగనున్నాయి. సదస్సుల షెడ్యూల్, అసెంబ్లీ తేదీలు క్లాష్ కాకుండా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో గ్లోబల్ సమ్మిట్, మార్చి 28, 29 తేదీల్లో జీ-20 వర్కింగ్ గ్రూప్ సదస్సు నిర్వహించనుంది.