గుంటూరు జిల్లాలోని తెనాలి పట్టణం చినరావూరులో క్షుద్ర పూజల కలకలం రేగింది. చినరావూరు రైల్వే స్టేషన్కు వెళ్లేదారిలో నాలుగు రోడ్ల కూడలిలో అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు బయటపడ్డాయి. రోడ్డు మధ్యలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, రక్తాన్ని స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.