పులివెందుల మోడల్ టౌన్ లో భాగంగా రోడ్ల విస్తరణలో కోల్పోనున్న స్థల, భూముల యాజమానులు ఈనెల 21వ తేదీన శనివారం పట్టణంలోని మునిసిపల్ కార్యాలయంలో ఆర్డిఓ వెంకటేశ్వర్లను కలవాలని ఆర్డిఓ కార్యాలయ అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. పట్టణంలోని సర్వీస్ రోడ్డు నిర్మాణం, విజయ హోమ్స్ నుంచి బస్టాండ్, బస్టాండ్ రోడ్డు నుంచి రాణితోపు , పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఉలిమెల్లరింగ్ రోడ్డు సర్కిల్, పులివెందుల వెజిటబుల్ మార్కెట్ నుంచి పార్నపల్లి రింగ్ రోడ్డు వరకు రహదారుల విస్తరణ, అలాగే అంబక పల్లె బైపాస్ రోడ్డు, గాంధీ సర్కిల్, పూలంగల్ సర్కిల్, బస్టాండ్ సర్కిల్ విస్తరణ కొరకు భూసేకరణ చేసే నిమిత్తం భూములు, నిర్మాణాలు నష్టపోయే యాజమానులు శనివారం ఉదయం 10 గంటల నుంచి తమ ఆధార్లతో హాజరుకావాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa