ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గడపగడపకి వచ్చేది సమస్యల పరిష్కరించడం కోసం కాదు పిడి గుద్దులు గుద్దడం కోసం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 20, 2023, 02:08 PM

వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు ఇంచార్జ్ దేవినేని అవినాష్ , అతని వర్గం చేతిలో ఈరోజు ఎవరికి మూడిందో? అని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్  వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రశ్నించిన 24 గంటల్లోనే రమీజా, ఫాతిమాలకు ఏం జరిగిందో చూశాం కదా అని అన్నారు. వాళ్లు గడపగడపకి వచ్చేది ప్రజా సమస్యల పరిష్కరించడం కోసం కాదని... ప్రశ్నించిన వారిని పిడి గుద్దులు గుద్దడం కోసమని మండిపడ్డారు. ‘‘మల్లమ్మ పెన్షన్ రావడం లేదని ఎందుకమ్మా ప్రశ్నించావు. మొన్నే కదా చూశాం రమీజా, ఫాతిమాలపై కారం చల్లారు, దాడి చేశారు, కేసులు పెట్టారు. చేయూత రావడంలేదని సత్యవతి, ప్రమీలా ఎందుకు ప్రశ్నించారమ్మ మీ పరిస్థితి ఏంటో?. కొంతమంది ఇతర పార్టీ నాయకులు అవినాష్‌కు అనుకూలంగా మాట్లాడొచ్చు. కానీ దాడులు చేసే వారిని తూర్పు నియోజకవర్గ ప్రజలు కాపు కాయరు’’ అని పోతిన వెంకట మహేష్ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com