ఏలూరుజిల్లా, ద్వారాకతిరుమల మండలం పి.కన్నాపురం గ్రామ పంచాయతీలో ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం గోపాలపురం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అధిక ధరలు , పెరిగిన విద్యుత్ చార్జీలు, రాష్ట్రంలో గాడి తప్పిన అభివృద్ధి లాంటి అంశాలపై ప్రజలకు వివరించారు. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కష్టాలు తీరాలంటే నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు.