జియ్యమ్మవలస మండలం, పెదకుదమ, సింగనాపురం గ్రామాలకు మధ్యలో సంచరించి బీభత్సం సృష్టించిన ఏనుగుల గుంపు శుక్రవారం గిజబ గ్రామానికి చేరుకున్నాయి. గిజబ ప్రధాన రహదారిపై అవి సంచరించడం తో ప్రయాణికులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పుష్కలంగా నీరు, సమృద్ధిగా ఆహారం లభించడంతో ఈ ప్రాంతాన్ని అవి విడిచిపెట్టడం లేదు. అటవీశాఖ సిబ్బంది ఆ గ్రామాల్లో ఉంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏనుగుల తరలింపు ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa