ఏపీలోని విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ పంపిణీ సంస్థలు ఊరట కలిగించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చార్జీలను పెంచాలని డిస్కంలు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. ఏటా ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ చార్జీలు అమలులోకి వస్తాయనే విషయం తెలిసిందే. అయితే ఈసారి చార్జీలు పెంచాలని డిస్కంలు ప్రతిపాదించలేదు. కేవలం ఫెర్రో అల్లాయిస్ టారిఫ్ ను మాత్రమే మార్చాలని డిస్కంలు కోరాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa