కలికిరిలో మసీదుల అభివృద్ధికి ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి రూ. 18 లక్షలు సొంత నిధులు కేటాయించారని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం వాల్మీకిపురంలో కలికిరి మైనార్టీ నాయకులకు ఆ చెక్ అందజేశారు. కార్యక్రమంలో మైనార్టీ కమీషన్ చైర్మన్ ఇక్బాల్ అహ్మద్, వైసిపి రాష్ట్ర కార్యదర్శి అగా మొహిద్దీన్, పార్టీ పరిశీలకులు సహదేవ రెడ్డి, మసీదు కమిటీల పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.