ఈనెల 22న నిర్వహించునన్న ఉత్తరప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి పోస్టర్ ను రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు శుక్రవారం శ్రీహరిపురం దరి కోరమాండల్ గేటు ఎదురుగా గల జీవీఎంసీ గ్రౌండ్ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం ఈనెల 22న సాయంత్రం 4 గంటలకు శ్రీహరిపురం జీవీఎంసీ మైదానంలో ఘనంగా నిర్వహించనున్నారని తెలిపారు. విశాఖలో నివసిస్తున్న ఉత్తర ప్రదేశ్, బీహార్, తదితర రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు.
ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ అన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నినాదంతో ప్రతి ఒక్కరు ఒకరి నొకరు గౌరవించుకోవాలని ఉద్దేశంతో ఈవేడుకను నిర్వహించనున్నామని అయన తెలిపారు. ఈ సందర్భంగా జరిగే సాం స్కృతిక కార్యక్రమాలలో ఢిల్లీ ఎంపి మనోజ్ తివారీ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. అనంతరం మైదానంలో జరుగుతున్న ఏర్పాట్ల గురించి స్థానిక నాయకులతో మాట్లాడి పలు సూచనలు చేసారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి దాడి పురుషోత్తం రమేశ్, గాజువాక నియోజక వర్గం ఇంఛార్జి కరణంరెడ్డి నరసింగ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, ములగాడ మండలం అధ్యక్షుడు ఎల్. రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర ఫిషర్ మెన్ సెల్ సభ్యుడు జీ. పైడిరాజు, ఇతర నాయకులు, కార్యకర్తలు, ఇతర రాష్ట్రాల ప్రజలు పాల్గొన్నారు.