సుజలాన్ భూముల సందర్శనకు వెళ్తున్న సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి. కె. పార్థసారథి ని కనగానపల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ సందర్బంగా కంబదూరు కనగానపల్లి మండలం పరిధిలోని నూతిమడుగు భానుకోట గ్రామ సమీపంలో సుజలాన్ కంపెనీకి చెందిన భూములను సందర్శించుటకు వెళ్లడానికి వీల్లేదు అంటూ కనగానిపల్లి మండలం కొండపల్లి దగ్గర సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి. కె. పార్థసారథి ని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీసు జీపులో స్టేషన్ కు తరలించారు. అయన తోపాటు టీడీపీ నాయకులు రామ్మూర్తి నాయుడు, కుంటిమద్ది రంగయ్య, నెట్టం వెంకటేష్, తదితరులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.