శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారం దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లాల సమావేశం నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు శనివారం తెలిపారు. ఈ మేరకు దివ్యాంగుల సేవా సమితి, ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో 2016 దివ్యాంగుల హక్కుల చట్టం సదస్సు కు శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణఆహ్వానం అందించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా రాష్ట్ర అధ్యక్షులు టిఎండి షఫీ, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎంకే రామాంజనేయులు, సాకే ఆంజనేయులు, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ హరినాథ్ రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.