అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అవినీతి అక్రమాలను నిలదీసేందుకు వెళుతున్న ప్రతిపక్ష టిడిపి నేతలను వైకాపా ప్రభుత్వం పోలీసులతో గృహ నిర్బంధాలు చేయించడం సీఎం జగన్ రెడ్డి పిరికిపంద పాలనకు నిదర్శనమని గుంతకల్లు నియోజక వర్గ టిడిపి ఇంచార్జ్, మాజీ. ఎమ్మెల్యే ఆర్. జితేంద్రగౌడు మండిపడ్డారు. మంత్రి ఉషశ్రీ చరణ్ నియోజకవర్గం కంబాదురు మండలం నూతిమ డుగు గ్రామ పొలాల్లోకి వెళుతున్నా రన్న సమాచారంతో గుంతకల్లు ఒకటవ పట్టణ ఎస్సై మురహరి బాబు తన సిబ్బందితో శనివారం మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడును గృహ నిర్బంధం చేసి నోటీసులు అందజేశారు. ఈసంధర్భంగా జితేంద్రగౌడు చారవాణిలో లోకల్ యాప్ విలేకరితో మాట్లాడుతూ సీఎం జగన్ రెడ్డి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు నుండి క్రింది స్థాయి నాయకుల వరకు భూ కబ్జాలు, అవినీతి అక్రమాలు దర్జాగా జరుగుతున్నాయని అన్నారు. వారి అక్రమాలను ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తా యని సీఎం జగన్ రెడ్డి తనవారిని కాపాడుకునేందుకు పోలీసులను ఉసిగొలిపి అప్రజాస్వామికంగా జిల్లా లోని టిడిపి ప్రధాన నాయకులను ఎక్కడికక్కడ గృహానిర్బంధాలు చేయించడం పిరికిపంద చర్య అన్నారు. జగన్ అరాచక పాలనపై ప్రజలు విసుగు చెందారని రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.