రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా శనివారం పులివెందుల పట్టణంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి వైద్య నిపుణులచే ఆర్టీసీ డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎంవీఐ కార్యాలయంలో ఆర్టిసి డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టిసి డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా ఎంవిఐ ప్రసాద్ మాట్లాడుతూ. కంటిచూపు సక్రమంగా లేకపోతే అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. బస్సులు నడిపే సమయంలో తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టిసి డిఎం ఉమా మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.