ప్రతి ఒక్కరూ డెంగీపై అప్రమత్తంగా ఉండాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి సిద్ధయ్య పేర్కొన్నారు. శుక్రవారం లింగాల పి హెచ్ సి పరిధిలోని చిన్నకుడాల గ్రామంలో ఫ్రై డే - డ్రైడే సందర్భంగా ఫీవర్, లార్వా సర్వే నిర్వహించారు. ఈ సందర్బంగా నీటి తొట్లలో అబైట్ ను పిచికారి చేసి మలేరియా, డెంగీ నివారణ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమ కాటుకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు భాస్కర్, నాగేశ్వరి, ఎంఎలెచ్పీ నవీన్, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.