ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం చిన్న కందుకూరు గ్రామానికి చెందిన వల్లెల వెంకటరామిరెడ్డి ఇటీవల అరుదైన బొన్ నేరో వ్యాధితో బాధపడుతున్నాడు. డాక్టర్లు వైద్యం కోసం 25 నుంచి 30 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని బాధితుడికి తెలిపారు. బాధితుడు ఆర్థికంగా అంతంత మాత్రమే కావడంతో వైద్యం చేయించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న కందుకూరు గ్రామానికి చెందిన శింగరెడ్డి రమణారెడ్డి బాధితుడి సమస్యను జై జవాన్ ఫౌండేషన్, శ్రీ వేమన రెడ్డి సంఘం దృష్టికి తీసుకువెళ్లారు.
దీంతో స్పందించిన వారు దాతల సహకారంతో 72, 000 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు శనివారం వారి స్వగ్రామానికి వెళ్లి జై జవాన్ ఫౌండేషన్ కోశాధికారి పూనూరు గురువారెడ్డి అందజేశారు. మరి కొంతమంది దాతలు కూడా వెంకటరామిరెడ్డి వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక సహాయం చేయాలని గురువారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జై జవాన్ ఫౌండేషన్ చైర్మన్ బి. యన్. రెడ్డి, వైస్ చైర్మన్ జాకీర్ హుస్సేన్, శింగ రెడ్డి రమణారెడ్డి, విలేజ్ ఫోర్స్ టీం అధ్యక్షుడు శశి కుమార్ రెడ్డి, సభ్యుడు సుభాని పాల్గొన్నారు.