ఇబ్బందికరమైన ఇనుము రుచితో ఉండే ఐరన్ ట్యాబ్లెట్లు వాడటం కంటే హాయిగా తినాలనిపించే రుచికరమైన దానిమ్మతో ఒంట్లో ఐరన్ మోతాదులు పెరుగుతాయి. ఈ పండు రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తనాళాలనూ శుభ్రపరుస్తుంది. ఒంటికి మంచి రక్తం పట్టడం వల్ల మనిషి చురుగ్గానూ మారుతారు. బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం మెరుగుపరచుకోవడం, వ్యాధినిరోధకతను పెంచుకోవడం లాంటి బహుళ ప్రయోజనాలను పొందాలంటే దానిమ్మ తినడం రుచికరమైన ఓ మంచి మార్గం.