రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగాలైనా ఇవ్వాలని, లేదంటే నిరుద్యోగ భృతి అయినా కల్పించాలని డీవైఎ్ఫఐ జి ల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ డిమాండ్ చేశారు. కడప జిల్లా, వైవీయూలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే ప్రతి యేటా జాబ్ క్యాలెండరు విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలవుతున్నా ఒక్క జాబ్క్యాలెండరు కూడా విడుదల చేయకపోవడం అన్యాయమన్నారు. ఉద్యోగాలు రాక ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇవ్వనిపక్షంలో నిరుద్యోగ భృతి అయినా కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి జాకీర్, సుబ్బరాయుడు పాల్గొన్నారు.