అనంతపురం జిల్లాలో సైబర్ నేరాలు అరికడుతూ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సమాచారాన్ని ఆన్‌లైన్లో నమోదు చేయడంపై సీఐ శేఖర్, ఎస్‌ఐ రామకృష్ణయ్య సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ.... సైబర్ నేరాలు జరగకుండా నిఘా ఉంచి అరిక ట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండా లని సూచించారు. వీటి బారినపడితే వెంటనే 1930కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో మోసపోయిన బాధితులకు సుమారు రూ. 59 లక్షలు రికవరీ చేయడం జరిగిందన్నారు. ఫోన్ ద్వారా ఓటీపీని అడిగినా తెలపకుండా, జాగ్రత్తగా ఉండా లన్నారు. ఇక నుంచి స్టేషన్‌కు చెందిన సమాచారాన్ని క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకిన్స్ నెట్ సిష్టంతో నమోదు చేయడం జరుగుతుందన్నారు. దీంతో రాష్ట్రంలో ఏమి జరిగిన తెలుసుకోవచ్చునన్నారు.