మంత్రి ఉషాశ్రీ చరణ్ భూ అక్రమాలపై టీడీపీ ఆందోళన కు దిగింది. క్షేత్రస్థాయి పరిశీలనకు బయలుదేరిన కళ్యాణదుర్గం టీడీపీ ఇన్చార్జ్ మాదినేని ఉమామహేశ్వర్ నాయుడుతో పాటు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలో టీడీపీ నేతలు, పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. రిసార్ట్ మంత్రి రిజైన్ చేయాలని... మంత్రి చేసింది పి.హెచ్.డి కాదు చేసేది దోపిడీ అంటూ టీడీపీ నేతలు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.