ఏపీ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పి ఏపీలో రాజకీయాలు చేయాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఏపీ రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా మాట్లాడిన కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం జిల్లా రైల్వే స్టేషన్‌లో ఎంపీ లాడ్స్ నిధులతో ఏర్పాటు చేసిన బెంచీలను ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..12 రైల్వేస్టేషన్‌లలో రూ.50 లక్షల ఎంపీ లాడ్స్‌తో ప్రయాణీకుల కోసం కుర్చీలు ఏర్పాటు చేశామన్నారు. రైల్వే రంగంలో మోదీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారని తెలిపారు. రూ.20 కోట్లతో గుంటూరు రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా రైల్వే వంతెనలు పూర్తి కావటం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వటం లేదని, భూ సేకరణ చేయడం లేదని అన్నారు. కడప - బెంగళూరు రైల్వే లైన్ కన్నా సీఎం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బస్సు ఛార్జీలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణీకుల నడ్డి విరుస్తోందని... దీంతో రైల్వేపై అదనపు భారం పడుతోందని జీవీఎల్ వెల్లడించారు.