జపాన్‌లో నెలకొన్న పరిస్థితులు ఆ దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అక్కడ ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఆహార పదార్థాలు, క్రూడాయిల్, బొగ్గు, నేచురల్ గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 2022లో ఏర్పడిన భారీ లోటు 1979 నుంచి ఇప్పటివరకు ఎన్నడూ సంభవించలేదు. యెన్ మారక విలువ కూడా తగ్గిపోతోంది. దీంతో ఆర్థిక మాంద్య ముప్పు వెంటాడే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు.