కృష్ణా నదిపై బ్యారేజ్ కం బ్రిడ్జిని నిర్మించాలని రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం మండల కేంద్రమైన కొత్తపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా నదిపై కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఐకానిక్ బ్రిడ్జి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. ఆ స్థానంలో ప్రకాశం బ్యారేజ్ తరహాలో బ్యారేజికం బ్రిడ్జి నిర్మిస్తే రాయలసీమ ప్రజానీకానికి ప్రయోజనం ఉంటుందని వివరించారు.