శ్రీశైలంలో మరో వివాదం రాజుకుంది. దేవుని సేవ ముసుగులో మల్లన్న ఆదాయానికి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు గండి కొడుతున్నారు. మల్లన్నస్వామికి అభిషేకాలు, స్పర్శ దర్శనాల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. మల్లన్న గర్భాలయ అభిషేకం టికెట్లు లేకపోయినా... ధర్మకర్తల మండలి సభ్యురాలు ఒకరు అభిషేకాలు చేయిస్తామంటున్నారు. ధర్మకర్తల మండలి సభ్యురాలి ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.