తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ సహాయంతో తీసిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఆగమశాస్ర్త నిబంధనల మేరకు ఆనంద నిలయ గోపురంపై చిత్రీకరణకు అనుమతులు లేవన్నారు. సోషియల్ మీడియాలో వైరల్ అవుతున్న విజువల్స్ పై విచారణ జరుపుతున్నామన్నారు. విజువల్స్ అఫ్ లోడ్ చేసిన వ్యక్తిని గుర్తించామని.. క్రిమినల్ కేసు నమోదు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రాథమికంగా ఇవి స్టిల్ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలుగా విజిలేన్స్ అధికారులు గుర్తించారు. కుట్ర కోణంలో టీటీడీపై దుష్ప్రచారం చేస్తూన్నారా? అన్న దిశగా కూడా విచారణ జరుపుతున్నాం. రెండు.. మూడు రోజులలో వాస్తవాలను భక్తులు ముందు వుంచుతామని.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.