జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్లపల్లె, కన్యతీర్థం గ్రామాల మధ్య వైఎస్ఆర్ స్టీల్‌ప్లాంట్ శిలాఫలకం ప్రాంతాన్ని జాయింట్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దారు రవీంద్రారెడ్డి, సర్వేయర్లతో కలసి ఆయన ఇక్కడకు వచ్చారు. స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించిన భూములకు సంబంధించి చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ గ్రామాల్లో కొంతమందికి పరిహారం అందలేదని, అందులో భాగంగా ఇటీవల రెవెన్యూ అధికారులు గ్రామాలకు వెళ్లి వారి వారి పేర్లను సేకరించారని సమాచారం. ఈనెల చివరిలో ముఖ్యమంత్రి స్టీల్ ప్లాంట్ శిలాఫలకం సమీపాన భూమిపూజ చేయనున్నారని, అందులో భాగంగా జేసీ పరిశీలించారని అధికారుల ద్వారా తెలిసింది.