కస్టోడియల్ మృతి కేసులో మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. మృతుని కుటుంబానికి రూ.15 లక్షలు పరిహారం చెల్లించాలంటూ తీర్పు ఇచ్చింది. కస్టోడియల్ డెత్ విషయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కస్టడీ మరణం అనేది నాగరిక సమాజంలో అత్యంత దారుణమైన నేరాల్లో ఒకటని పేర్కొంది. పోలీసులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని పౌరులను అమానవీయ రీతిలో హింసకు గురి చేయడం తగదని స్పష్టం చేసింది.