తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే యువతకు భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీ కర్నూలు ఇన్చార్జి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం నగరంలోని 6, 7 వార్డులకు చెందిన మున్నా, సొహేల్ బాషా, అబ్దుల్ రెహిమాన్ల ఆధ్వర్యంలో యువకులు టీడీపీలో చేరారు. వీరందరికీ టీజీ భరత్ టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ... తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఎన్నికల్లో గెలిపిస్తే.. కర్నూలుకు పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జహంగీర్ భాషా, వార్డు ఇన్చార్జి ఇబ్రహీం, మహబూబ్ పాల్గొన్నారు.