తల్లిదండ్రులను 3 కత్తులతో 282 సార్లు పొడిచి మరీ చంపేశాడో దుర్మార్గుడు. ఈ ఘటన ఇంగ్లండ్‌లోని యార్క్ షైర్లో డిసెంబర్ 20, 2021న జరిగింది. ఈ కేసుపై అక్కడి కోర్టు గురువారం విచారించింది. ఈ సందర్భంగా తల్లి జాన్‌పై 90 సార్లు, తండ్రి బెవర్లీపై 180 సార్లు దాడి చేసి పోలీసులకు లొంగిపోయానని నిందితుడు డేవిడ్ కోర్టుకు వెల్లడించాడు. ఇక కొన్నాళ్లుగా డేవిడ్ మానసికస్థితి సరిగ్గా లేదని పోలీసులు తెలిపారు.