ఏపీలో అవినీతి నిరోధానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుండి ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 14400కు ఫోన్ చేస్తే రూ.5000 నుండి రూ.10000 ప్రోత్సాహకంగా ఇవ్వనుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని కోసం అయినా లంచం అడిగితే 14400 నెంబర్ కు ఫోన్ చేసి అర్జీ నెంబర్, సిబ్బంది వివరాలు తెలిపి గిఫ్ట్ అందుకోవాలని సూచించింది. దీని ద్వారా ఉద్యోగుల అవినీతిపై ఫిర్యాదులకు మరింత వీలు కలగనుంది.