తమిళనాడు చెంగల్పట్టు జిల్లా మధురాంతకంకు చెందిన నిర్మల్ కుమార్ 2018 జులై 24న తన స్నేహితుడు అకౌంట్ లో రూ.900 డిపాజిట్ చేయాలని ఎస్బీఐకు వెళ్లాడు. రెండు రూ.500 నోట్లు ఇవ్వగా ఆ మొత్తాన్ని అతని స్నేహితుని ఖాతాలో సిబ్బంది జమ చేశారు. రూ.100 తిరిగి ఇవ్వాలని అడగ్గా చర్యలు తీసుకోలేదు. దీంతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా విచారించి రూ.65 వేల జరిమానా విధించింది.