టీడీపీ నేత బుద్ధా వెంకన్న ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు, లోకేశ్ కు ప్రాణహాని ఉందని ఆరోపించారు. లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1 ను జారీచేసిందని మండిపడ్డారు. పోలీసులు అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా ఈనెల 27న కుప్పంలో పాదయాత్ర జరిగి తీరుతుంది అని తెలిపారు. ఈ పాదయాత్రకు లక్షలాది మంది హాజరవుతారని, అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.