అలల ధాటికి సముద్రంలోకి కొట్టుకుపోయిన ఓ వ్యక్తి 24 రోజుల పాటు నరకం అనుభవించాడు. కెచప్, గార్లిక్ ఫౌడర్ తిని.. వర్షపు నీరు తాగుతూ ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. డొమినికాకు చెందిన ఎల్విస్ ఫ్రాంకోయిస్ డిసెంబర్ లో తన బోటుతో సహా సముద్రంలో కొట్టుకుపోగా.. ఇటీవల అతన్ని గుర్తించిన విమాన సిబ్బంది రక్షించారు. అద్దం సాయంతో సిగ్నల్ ఇవ్వగా ఎల్విస్ ను కాపాడారు.